నీ పరిచయం కోసం పరితపిస్తున
నాలో అలజడిని నింపే జ్ఞాపకాల కోసం
నా ప్రేమ అక్షరం అయితే
రాస్తాను ఓ ప్రేమ లేఖ
ప్రతి స్వప్నం నీ కలియిక కోసం
ఆకాశం లో తారల మధ్య ఊపిరి పోసుకున్న వేళ
రాగమై నను పలుకరించే నీ పిలుపు
అతి కమనీయం నీ సుస్వరం
వేచి ఉన్నా నీ పరిచయం కోసం
నా చేయి పట్టి నీ ప్రపంచం చుపుతావ్ అని
నా కష్టంలో నుఖమై నువ్వు ఉంటావ్ అని
వేచి చూస్తునా నీ ప్రోత్సాహం కోసం
నా ఆనందం నువ్వే అని గర్వించి
బాధను తరిమి కొట్టే బలం ఇస్తావ్ అని
ప్రాణమంత కరీదు చేసే నీ ప్రేమ కోసం
ఇది నా తొలి కావ్యం ...!!!